నేడు సోలిపేట నివాసంలో
టీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశం
మండలి ఎన్నికపై వ్యూహ రచన
మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డికే
టికెట్ ఖరారు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగే ఎన్నికలో టీఆర్‌ఎస్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డికే దాదాపుగా ఖరారైంది. అధికారికంగా ప్రకటించడం ఇక లాంఛనమే. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ.... భారీ మెజార్టీతో గెలిచి ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ మేరకు కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు గురువారం రాత్రి 8 గంటల తరువాత హైదరాబాద్‌లోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నివాసంలో సమావేశం కానున్నారు. రామలింగారెడ్డిని పరామర్శించడంతోపాటు, కౌన్సి ల్ ఎన్నికల వ్యూహ,ప్రతివ్యూహాలపై చర్చించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువిశ్వసనీయంగా తెలిసింది.
అనారోగ్యం కారణంగా పదిరోజుల కిందట సోలిపేట రామలింగారెడ్డి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కోలుకున్న ఆయన మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ముఖ్యంగా ఆయన్ను పరామర్శించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పనిలోపనిగా కౌన్సిల్ ఎన్నికలపై కూడా చర్చిం చాలని నిర్ణయించారు. జిల్లాకు చెందిన ముఖ్యమైన 30 మంది నేతలను మాత్ర మే ఈ సమావేశానికి పిలిచారు.
సమావేశానికి వచ్చే వారు... వారి వారి మండలాల్లో ఎంపీటీసీల సంఖ్య, ఏ పార్టీ నుంచి గెలుపొందారు?, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? , టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయా?, తదితర పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ముందుగానే సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన వి.భూపాల్‌రెడ్డి గత ఏడాది ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాారు. ఎమ్మెల్సీ టికెట్ ఆయనకే ఇస్తామని కేసీఆర్ ఆయన చేరిక సమయంలోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు భూపాల్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్టు తెలిసింది. మొత్తం 882 మంది ఓటర్లు ఉండగా ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం 880 ఓట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 70 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు ఉండటం గమనార్హం.
కీలక భేటీ!
Published Wed, Dec 2 2015 11:44 PM | Last Updated on Mon, Oct 22 2018 8:47 PM
Advertisement
Advertisement