'అనాథలకు తల్లీదండ్రీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే' | trs minority secretary statement on cm kcr speech | Sakshi
Sakshi News home page

'అనాథలకు తల్లీదండ్రీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే'

Published Thu, Jun 11 2015 8:50 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

trs minority secretary statement on cm kcr speech

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడం అభినందనీయమని టీఆర్‌ఎస్ రాష్ట్ర మైనార్టీ విభాగం మాజీ కార్యదర్శి మహ్మద్ నసీర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణలో అనాథలు ఎవరూ ఉండబోరని, అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఇది ప్రభుత్వం తీసుకున్న సామాజిక బాధ్యత అని నసీర్ పేర్కొన్నారు. ఈ హామీ అమలైతే దేశంలోనే అనుసరించే గొప్ప కార్యక్రమం అవుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement