మానవత్వాన్ని చాటుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే | TRS MLA Kranthi Kiran Humanity Work For Poor Family | Sakshi
Sakshi News home page

మానవత్వాన్ని చాటుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Published Sun, Dec 16 2018 8:07 PM | Last Updated on Sun, Dec 16 2018 8:36 PM

TRS MLA Kranthi Kiran Humanity Work For Poor Family - Sakshi

ఎమ్మెల్యే క్రాంతికిరణ్

సాక్షి, మెదక్‌: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కాజా ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. కాజా మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న క్రాంతికిరణ్‌ ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాజా కుంటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అతని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement