'వ్యక్తిగత పరిచయంతోనే పవన్‌ను కలిశా' | Turpu Jayaprakash Reddy says meeting with pawan kalyan is personal | Sakshi
Sakshi News home page

'వ్యక్తిగత పరిచయంతోనే పవన్‌ను కలిశా'

Published Fri, May 23 2014 12:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

'వ్యక్తిగత పరిచయంతోనే పవన్‌ను కలిశా'

'వ్యక్తిగత పరిచయంతోనే పవన్‌ను కలిశా'

హైదరాబాద్: తాను బీజేపీతో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) తోసిపుచ్చారు. తనకు బీజేపీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిచయంతోనే పవన్‌ కళ్యాణ్ ను కలిశానని ఆయన వివరణ ఇచ్చారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ జెడ్పీ స్థానం గురించి పొన్నాలతో చర్చించినట్టు చెప్పారు. జగ్గారెడ్డి బీజేపీలో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని అంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement