‘నా దమ్మేంటో టీఆర్‌ఎస్‌కు చూపిస్తా’ | turpu jayaprakash reddy slasm TRS govt | Sakshi
Sakshi News home page

‘నా దమ్మేంటో టీఆర్‌ఎస్‌కు చూపిస్తా’

Published Mon, Jun 5 2017 4:20 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

‘నా దమ్మేంటో టీఆర్‌ఎస్‌కు చూపిస్తా’

‘నా దమ్మేంటో టీఆర్‌ఎస్‌కు చూపిస్తా’

సంగారెడ్డి: రాహుల్‌ గాంధీ సభతో టీఆర్‌ఎస్‌ నాయకుల గుండెల్లో దడ మొదలైందని కాంగ్రెస్‌ నాయకుడు తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి(జగ్గారెడ్డి) అన్నారు. సభ సక్సెస్‌తో మంత్రి హరీశ్‌రావు మెంటల్‌గా మారారని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. చిల్లర రాజకీయాలు మనుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు హితవుపలికారు. హరీశ్‌ ఆదేశాలతోనే అమిన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వు ఇచ్చారన్నారు. సర్పంచ్ తొలగింపు ఆపకుంటే కలెక్టర్‌ను ఘెరావ్‌ చేస్తామని హెచ్చరించారు. సర్పంచ్ లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.

అమీన్‌పూర్‌ భూముల కేసును తిరగదోడుతున్నారని, భూముల కేటాయింపులో తన తప్పేమీలేదని పేర్కొన్నారు. కేసులు పెడితే తన దమ్మేంటో టీఆర్‌ఎస్‌కు చూపిస్తానని అన్నారు. తనపై కేసులు పెట్టిన మరుసటి రోజు నుంచి అధికార పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు.

ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మంత్రి కడియం శ్రీహరిని ఘోరావ్‌ చేస్తామని హెచ్చరించారు.  గతంలో తనను టీఆర్‌ఎస్ లోకి రావాలని వత్తిడి చేశారని, వారి మాటకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నందుకు వేధిస్తున్నారని అమీన్‌పూర్‌ సర్పంచి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement