
త్వరలో రెండు వ్యవసాయ కళాశాలలు
జగిత్యాల, అశ్వరావుపేటలో ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయ కళాశాలలను ప్రారంభించనున్నామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు.
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు
రాజేంద్రనగర్: జగిత్యాల, అశ్వరావుపేటలో ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయ కళాశాలలను ప్రారంభించనున్నామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో వారు మండలి నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.
గుజరాత్‌కు చెందిన మాజీ ఉపకులపతి డాక్టర్ ఆర్‌సీ మహేశ్వరి నేతృత్వంలోని ప్రతినిధులు విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ప్రవీణ్‌రావుతో సమావేశమయ్యారు. వ్యవసాయ కళాశాలలో వర్చ్యువల్ తరగతి గదిని ప్రారంభించారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పథకం మీద రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.