దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలో శుక్రవారం రాత్రి ఆటోను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. చెన్నంపేట మండలం నేరడిగుమ్మ గ్రామానికి చెందిన పలువురు దేవరకొండ మండలం దర్వేష్‌పురం గ్రామంలో రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్నారు.
తిరుగు ప్రయాణంలో వారి ఆటోను ఓ ట్రాక్టర్ అధిగమించే ప్రయత్నంలో ఢీకొంది. ఆటో బోల్తా పడగా.. ఇద్దరు మహిళలు మృతి చెందారు. నలుగురికి గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ఇద్దరు మృతి
Published Fri, Mar 4 2016 10:04 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement