కొండాపూర్ (మెదక్) : ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అనంతసాగర్ గ్రామానికి చెందిన రాజు(25), అనిల్(22)లు చెరువు దగ్గరకు వెళ్లగా... అనిల్‌కు ఈత రాకపోయినా నీటిలోకి దిగడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో రాజు కూడా నీటిలోకి దిగి మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు రక్షించేలోపే అనిల్ మృతి చెందగా, రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచాడు.