రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పీరం గ్రామంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు దిగిన దీపక్(8), వాసు(9) అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ రోజు రెండవ శనివారం కావడంతో దీపక్, వాసు, సందీప్ అనే ముగ్గురు చిన్నారులు పీరం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు.
చెరువులో ఈతకు దిగిన దీపక్, వాసు ఎంతకీ బయటకు రాకపోవడంతో సందీప్ ఇంటి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.