'తెలంగాణ' ఆమోదయోగ్యం కాదా? | Uttamkumar reddy questioned the Union Home Minister about Formation of Telangana | Sakshi
Sakshi News home page

'తెలంగాణ' ఆమోదయోగ్యం కాదా?

Published Mon, Aug 12 2019 2:39 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttamkumar reddy questioned the Union Home Minister about Formation of Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు మీకు ఆమోద యోగ్యం కాదా..? అంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై హోంమంత్రి అమిత్‌ షా పదే పదే విమర్శిస్తూ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోస్‌ రాజు, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, పార్టీ నేత మహేశ్‌ గౌడ్‌ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ అత్యంత క్లిష్ట సమయంలో నాయకత్వం వహించి కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు.

రాజీనామా చేసిన నేపథ్యంలో వారి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా రావడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియాగాందీకి ప్రత్యేక స్థానం ఉంది. మొన్న జరిగిన లోక్‌సభ సమావేశాల్లో హోంమంత్రి మాట్లాడిన తీరు నిర్ఘాంతపరిచింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను విమర్శించడం ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర ఏర్పాటులో హోం శాఖ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వ్యక్తిగా చెబుతున్నా.. కాశ్మీర్ పునర్‌ వ్యవస్థీకరణ సందర్భం లో తెలంగాణ ప్రక్రియను విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై 2009 డిసెంబర్‌లోనే హోం మంత్రి ప్రకటించారు. అఖిలపక్ష సమావేశాలు జరిపారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపారు. అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ ఏర్పాటు చేసిన సంగతి హోంమంత్రికి తెలియాలి. దర్వాజాలు బంద్‌ చేసి తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఏ బిల్లు పెట్టినా ఓటింగ్‌ జరిపే సమయంలో తలుపులు మూసేస్తారు..’అని చెప్పారు.

నెహ్రూపై తప్పుడు ప్రచారమా.. 
ప్రధాని, హోంమంత్రి, చోటా మోటా బీజేపీ నేతలు కూడా నెహ్రూపై వ్యాఖ్యానించడం సరికాదని ఉత్తమ్‌ అన్నారు. ‘స్వాతంత్య్రం కోసం పదేళ్లు జైల్లో ఉన్న నెహ్రూపై తప్పుడు ప్రచారం చేయడం, చరిత్రను వక్రీకరించడం బాధగా ఉంది. ఆరి్టకల్‌ 370 వర్తింపజేయడం ఆ నాటి కేబినెట్‌ నిర్ణయం. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు దానిని విమర్శించడం, వారి గొప్పతనాన్ని తగ్గించేలా మాట్లాడటం సమాజంలోని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. కశ్మీర్‌ సమస్యను నెహ్రూ తయారుచేశారన్న అమిత్‌ షా వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు.. హైదరాబాద్, జునాగఢ్‌ను సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విలీనం చేశారని, కశీ్మర్‌ సమస్య నెహ్రూ తెచ్చారని ప్రచారం చేస్తున్నారు. వీరు ఒకే కేబినెట్‌లో ఉండి అవి చేస్తే చరిత్రను వక్రీకరిస్తున్నారు. అన్ని నిర్ణయాలు కలసికట్టుగా తీసుకున్నవే. వారిద్దరూ కాంగ్రెస్‌ నేతలే’ అని పేర్కొన్నారు.  

బీజేపీ బలంతో వచ్చినవి కావు: కుంతియా
అంతకుముందు కుంతియా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు తదుపరి సంస్థాగత ఎన్నికలు జరిగేంతవరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉంటారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ సమర్థంగా పనిచేశారు. దేశవ్యాప్తంగా పోరాటాల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఆయన బాధ్యత లేదని సీడబ్ల్యూసీ అభిప్రాయపడుతూ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడింది. ఆయన తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తం గా 200 మంది నేతలు శనివారం సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు తమ అభిప్రాయం తెలిపారు. రాహుల్‌ అందుకు సిద్ధంగా లేరు.

సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాం దీని ఎన్నుకుంది. టీపీసీసీ దీనిని స్వాగతిస్తోంది. తెలంగాణ ఏర్పాటు కేవలం సోనియా వల్లే సాధ్యమైంది. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్‌ శ్రేణులు సమర్థంగా పనిచేసి విజయం సాధి స్తాయి. కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీకి వచ్చిన ఆ 4 సీట్లు బలం వల్ల వచ్చినవి కావు. ఆదిలాబాద్‌ ఎంపీ గెలవడానికి కారణం ఆయ న గోండుల నాయకుడు.. నిజామాబాద్‌లో రైతులంతా కవితను ఓడించాలని నిర్ణయించుకోవడంతో అక్కడ బీజేపీ గెలిచింది. మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పోయినా ముగ్గురు ఎంపీలు గెలిచారు. మా పార్టీ కచ్చి తంగా బలపడుతుంది’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement