సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయనకు ఈసారి ఎన్నికల్లో పొత్తుల పేరుతో అధిష్టానం కొత్తగూడెం టికెట్ నిరాకరించింది. అధిష్టానం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి, డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.1989, 1999, 2004లో వనమా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రి సేవల శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయ న ‘సాక్షి’తో మాట్లాడుతూ... టికెట్ల విషయం లో అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ రిక్తహస్తం చూపించిందన్నారు. జిల్లాలో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వకపోవడం ఆవర్గాలను ఆవేదనకు గురిచేసిందని విమర్శించారు. వైఎస్ సంక్షేమ పథకాల వల్లే జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారన్నారు. కాగా, వనమాతో పాటు ఆయన తనయుడు వనమా రాఘవేందర్‌రా వు, నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మహిపతి రామలింగం, కాల్వ భాస్కర్‌తో పాటు పది మంది సర్పంచ్‌లు వైఎస్సార్‌సీపీలో చేరా రు.వారివెంట వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెం టు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీలోకి వనమా
Published Wed, Apr 9 2014 2:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement