అక్కడికొచ్చేసరికి భయమంటాడు..
అంతంటాడు.. ఇంతంటాడు..
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు మగాళ్ల వెనకడుగు
- ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్న మహిళలు 75 శాతం
- వేసెక్టమీ చేయించుకుంటున్న మగాళ్లు 0.62 శాతమే
మగాడు.. కోరమీసమున్న మగాడు.. అన్నింటా ముందుంటానంటాడు.. అంతంటాడు.. ఇంతంటాడు.. అక్కడికొచ్చేసరికి మాత్రం అమ్మో.. భయమంటాడు..
కుటుంబ నియంత్రణ విషయానికొచ్చేసరికి మగాడు ముందుండనంటున్నాడు.. అనేక అపోహల బారిన పడి.. తూచ్ అంటున్నాడు. అప్పట్లోనే కాదు.. ఇప్పటి హైటెక్ పురుషులదీ అదే బాట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015ృ16 గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నా యి. ‘‘చిన్నకుటుంబం.. చింతలేని కుటుంబం..’’ కుటుంబ నియంత్రణపై ప్రచారం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన నినాదం ఇది.. ఒకవైపు పెరిగిపోతున్న దేశ జనాభా.. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు.. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణకు సర్కారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో చాలా జంటలు.. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సిద్ధమవుతున్నాయి.
కానీ.. ఒక కుటుంబంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించు కోవాల్సింది ఎవరు..? మా మూలుగా అయితే మగాళ్ల యినా.. ఆడ వాళ్లయినా ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే వాస్తవంలో జరుగు తోంది వేరు.. కుటుంబ నియంత్రణ అంటే ఆడవాళ్లకే పరిమితం అనే ధోరణి మన దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అధికారిక గణాం కాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గర్భ నిరోధానికి సంబంధించిన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను చేయించుకుంటున్న మహి ళలు 75 శాతానికి పైనే. ఫ్యామిలీ ప్లానింగ్ చేయిం చుకుంటున్న మగాళ్ల సంఖ్య 0.62 శాతమే.
పదేళ్ల నాటి కంటే తక్కువగా..
పదేళ్ల క్రితం 1శాతం ఉన్న మగాళ్ల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్య ఇప్పుడు 0.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఈ సంఖ్య మగాళ్లలో గర్భ నిరోధక ఆపరేషన్ల పట్ల ఉన్న నిరాసక్తతను స్పష్టం చేస్తోంది. దీనికి అనేక కార ణాలు ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక, గర్భ నిరో ధానికి సంబంధించి అవగాహన లేకపోవడం.. కుటుంబ నియంత్రణ పద్ధతులపై పరిజ్ఞానం లేకపోవడం.. మూఢ నమ్మకాలు.. దురభిప్రా యాలు.. అన్నిటికన్నా ఎక్కువగా.. ఇది చేయిం చుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని భయపడటం. వాస్తవానికి మహిళలతో పోలి స్తే.. కుటుంబ నియంత్రణకు అత్యంత సురక్షి తమైన పద్ధతి వేసెక్టమీ. సులువైనది.. త్వరిత గతిన పూర్తయ్యేది. ఎటువంటి సైడ్ ఎఫెక్టస్ లేనిది. ృ సాక్షి, తెలంగాణ డెస్క్
ఎటు చూసినా ఇదే తీరు..
ప్రపంచవ్యాప్తంగా కూడా వేసెక్టమీ చేయించుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. 2.4 శాతం మందే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అమెరికాలో 10.8 శాతం.. కెనడాలో 21.7 శాతం బ్రిటన్‌లో 21 శాతం మంది వేసెక్టమీ చేయించుకుంటున్నారు. మన పొరుగుదేశాల విషయానికి వస్తే.. భూటాన్ 12.8 శాతం.. నేపాల్‌లో 4.8 శాతం మంది వేసెక్టమీ చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌లో పురుషులే ఎక్కువగా పాల్గొనాలని, ఇందుకోసం భారీ స్థాయిలో చర్యలు తీసుకోవాలని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా చెపుతున్నారు. భాగస్వామి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి మగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు రావాలని.. కుటుంబ నియంత్రణ వంటి నిర్ణయాల్లో భార్యలను కూడా భాగస్వాములను చేయాలని ఆమె సూచించారు.