
నారాయణఖేడ్: పోలింగ్ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వారు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషిద్ధం. ఎవరైనా తన ఓటును ఇతరులకు చూపిస్తే రూల్ 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు ఎన్నికల అధికారులు అతడిని గుర్తించి బయటకు పంపివేస్తారు.
ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. అనంతరం లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. నిబంధనల మేరకు అంధులు ఓటు వేయడానికి వెంట 18 ఏళ్లు నిండిన సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు.
ఓటు రహస్యం..
ఫలానా వారికి ఓటు వేస్తాను, వేశాను, అని బూత్‌లో చెప్పడం నేరంగా పరిగణిస్తారు. వారిని ఓటు వేయనీయరు. దివ్యాంగులు ఓటు వేయడానికి సహాకుడిగా మరో వ్యక్తిని వెంట అనుమతిస్తారు. వారు మరో వైకల్యం గల ఓటరు వెంట సహాయకుడిగా రావడానికి అనుమతిలేదు. పోలింగ్ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు. ఓటు వేయడం ఆలస్యం అయినా, వెళ్లిన ఓటరు యూనిట్‌పై కాగితాలు, టేప్‌లు అతికిస్తున్నట్లు అనుమానం వస్తే పోలింగ్ ఏజెంట్లు ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్ గది వరకు వెళ్లవచ్చు.
అధికారి మాత్రమే అక్కడ ఏం జరగలేదని ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు. ఓటువేయడం తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసిన ఓటరుకు పోలింగ్ అధికారి నమూనా ద్వారా ఏజెంట్ల సమక్షంలో ఓటు వేసే విధానంపై డమ్మీ గుర్తులపై వివరిస్తారు.