సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. భద్రాచలంతోని గోదావరిలో నీటీ మట్ట 26అడుగులకు చేరింది.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరింది. సాధారణ నీటి మట్టం20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.892టీఎంసీలకు చేరింది. కుమరంభీంలోని కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగుప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. తాలిపేరు ప్రాజెక్టు నీటిమట్టం 72.80మీటర్లకు చేరింది. ఇన్‌ప్లో 6100క్యూసెక్కులుగా ఉంది. అధికారులు ఇప్పటికే నాలుగు గేట్లు ఎత్తివేశారు. 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాం ప్రాజెక్టు నీటిమట్టం 1058.60అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 2401క్యూసెక్కులుగా ఉంది. కిన్నెసాని ప్రాజెక్టు భారీని వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 399.10అడుగులుగా ఉంది. భారీ వర్షాలతో సత్తుపల్లిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment