'మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు' | We are obey government acts, Telangana minister Jagadish Reddy | Sakshi
Sakshi News home page

'మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు'

Published Tue, Jan 6 2015 12:24 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

'మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు'

'మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు'

న్యూఢిల్లీ: చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రమే ఎంసెట్ నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం విద్యాశాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదని వెల్లడించారు.

ఎంసెట్ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలలో ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సందిగ్థత నెలకొంది. ఈ అంశం గవర్నర్ వద్దకు చేరింది. ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమక్షంలో చర్చలు జరిపిన సమస్య ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement