సం‘క్షామం’ | welfare of those who are eligible through the branches every year | Sakshi
Sakshi News home page

సం‘క్షామం’

Published Thu, Jul 24 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

సం‘క్షామం’

సం‘క్షామం’

నీలగిరి : అధికారుల అలసత్వం వల్ల లబ్ధిదారుల కు పథకాలు అందకుండాపోతున్నాయి. ప్రభు త్వ మంజూరు చేసిన సబ్సిడీ బ్యాంకుల్లో మూ లుగుతున్నా రుణాలు మాత్రం అందలేదు. సంక్షేమ శాఖల ద్వారా అర్హులైన వారికి లబ్ధిచేకూర్చేందుకు ప్రతి ఏడాది వార్షిక ప్రణాళికను ఖరారు చేస్తారు. ఆ తరువాత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి బ్యాంకర్లు రుణాల మంజూరుకు అంగీకార పత్రం అందజేస్తారు. ఆ విధంగా బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తెచ్చుకున్న వారికి మాత్రమే సంక్షేమ శాఖల నుంచి సబ్సిడీ విడుదల చేస్తారు.
 
 సంక్షేమ శాఖల నుంచి నేరుగా ఆన్‌లైన్‌లోనే లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీ చేరుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచారం పంపిస్తారు. అనంతరం సబ్సిడీ విడుదలైన లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి పథకాలను గ్రౌండింగ్ చేస్తారు. ఏ బ్యాంకు ద్వారా ఎంతమంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదలైంది? ఎంత మంది లబ్ధి పొందారు ? అనే దానికి సంబంధించి బ్యాంకర్ల నుంచి సంక్షేమ శాఖల అధికారులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) తెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ రెండేళ్ల నుంచి ఈ విధానానికి అధికారులు స్వస్తి చెప్పారు. పథకాల గ్రౌండింగ్ గురించే పట్టించుకోవడమే మానేశారు. దీంతో లక్షల రూపాయల సబ్సిడీ సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది.
 
 రూ.1.12 కోట్ల సబ్సిడీ..
 2012-13కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లకు సంబంధిం చి సుమారు రూ.1. 12 కోట్ల సబ్సిడీ బ్యాంకుల్లోనే మూలుగుతోంది. లబ్ధిదారుల పేరు మీద వారి ఖాతాల్లోనే ఈ సబ్సిడీ మొత్తం ఉండిపోయింది. సబ్సిడీ విడుదలైనప్పటికీ రుణాలు మంజూరుగాక లబ్ధిదారులు సంక్షేమ శాఖల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కనీసం సంబంధిత బ్యాంకుల నుంచి యూసీలు తెప్పించుకుని ఎంత మందికి రుణాలు మంజూరు చేశారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. లబ్ధిదారులు మాత్రం ఇంకా రుణాలు వస్తాయన్న ఆశతో ఎదురుచూడాల్సి వస్తోంది.
 
 కాగితాలకే పరిమితం...
 2013-14కు గాను ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్‌ల వార్షిక ప్రణాళిక బుట్టదాఖలైంది. ఈ ఏడాదికి సంబంధించి నిర్ధారించిన లక్ష్యం కంటే మంజూరు ఇచ్చిన యూనిట్లు చాల స్వల్పం గానే ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం నయాపైసా కూడా సబ్సిడీ విడుదల చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 93 యూనిట్లకుగాను రూ.78 లక్షల సబ్సిడీ బ్యాంకులకు విడుదలైంది. దీంట్లో కేవలం 39 మందికి మాత్రమే రూ.20 లక్షల సబ్సిడీ అందించారు. మిగిలిన రూ.58 లక్షలు బ్యాంకుల్లోనే మూలుగుతోంది.  
 
 ప్రభుత్వం పైనే ఆశలు
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక ప్రణాళిక ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ కొత్త ప్రణాళికను ప్రకటించాల్సి వస్తే గతేడాది మంజూరు ఇచ్చిన ప్రతిపాదనలు ఉంటాయా? రద్దు  చేస్తారా? అన్నది అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. ఎస్సీ వార్షిక ప్రణాళికను రూపొందించామని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. కానీ మిగతా శాఖల ప్రణాళికలపై ఎలాంటి స్పష్టత లేదు. వాస్తవానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో గతేడాది మంజూరు చేసిన యూనిట్లకు తప్పనిసరిగా సబ్సిడీ విడుదల చేసి పథకాలను గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయం పైనే లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు.
 
 బ్యాంకులో డిపాజిట్ చేశా - ఎం.విఠల్, పుట్టగూడెం, రాజాపేట మండలం
 నేను పాడిపశువుల కోసమని ఎస్టీ కార్పొరేషన్‌కు గతేడాది దరఖాస్తు చేశా. బ్యాంకర్లు రుణం ఇప్పిస్తామని చెప్పి నా నుంచి రూ.30 వేలు డిపాజిట్ కట్టించుకున్నారు. కానీ ఇంకా కార్పొరేషన్ నుంచి సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో బ్యాంకర్లు సబ్సిడీ వస్తే తప్ప రుణం ఇవ్వమని చెబుతున్నారు.
 
 ఎస్సీ కార్పొరేషన్
 ఈ కార్పొరేషన్ నుంచి 1769 యూనిట్లకు గాను పాత వాటితో కలిపి 1789 యూనిట్లకు మంజూరు ఇచ్చారు. దీంట్లో 1069 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement