సాక్షి, నల్లగొండ: నల్లగొండలో హోల్‌సేల్ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బత్తాయి మార్కెట్‌కు 12 ఎకరాల స్థలం కేటాయించామని, ఆ స్థలంలోనే హోల్‌సేల్ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో హరీశ్‌రావు, మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించారు. అనాజిపురం వద్ద బునాదిగాని కాల్వ విస్తరణ పనులకు, మోత్కూరులో మినీట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేశా రు.
రామన్నపేట మండల కేంద్రంలో రూ.66 కోట్ల తో చేపట్టనున్న ధర్మారెడ్డి కాల్వ ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత నల్లగొండ మండలం గంధంవారి గూడెం గ్రామ సమీపంలోని ఎస్సెల్బీసీ ప్రాంగణంలో బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. బత్తాయి మార్కెట్‌లోనే హోల్‌సేల్ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేం దుకు రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటిం చారు. వచ్చే ఏడాదిలోగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని తీసుకువస్తామని, ఈ ఏడాదిలోనే బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం దగ్గర మోటా ర్లు ఏర్పాటు చేయించి నీళ్లు ఎత్తిపోయిస్తామని చెప్పారు.
నల్లగొండలో బతా ్తయి పండ్ల నిల్వ కోసం కోల్డ్‌స్టోరేజీ కూడా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా నీటిపారుదల శాఖలో ఒక్క ఈఈ ఉండేవాడని, తాము అధి కారంలోనికి వచ్చిన తర్వాత నలుగురు ఈఈలు, ఒక ఎస్‌ఈని పెట్టి చెరువుల మరమ్మతుల కోసం రూ.1100 కోట్లు వెచ్చించామని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మార్కెట్ శంకుస్థాపన అనంతరం ఎంపీ సుఖేందర్‌రెడ్డి నివా సానికి వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం పనుల సమీక్షకు వెళ్లి పదినిమిషాలు గడిపి సాయంత్రం 7:45 గంటలకు హైదరాబాద్ వెళ్లిపోయారు.
నల్లగొండలో హోల్‌సేల్ పండ్ల మార్కెట్
Published Wed, May 17 2017 3:19 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement