
స్వైన్‌ఫ్లూపై చర్యలు తీసుకోవాలి: పొంగులేటి
స్వైన్‌ఫ్లూను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధి బారినపడిన వారిని ఆదుకోవాలని, నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించేలా చూడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. స్వైన్‌ఫ్లూపై ప్రజల్లో అవగాహన పెంచి, చైతన్యాన్ని కలిగించాలన్నారు. ప్రభుత్వపరంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పొంగులేటి కోరారు.