మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీలోని కొండాయిగూడెం గ్రామానికి చెందిన తెరప లక్ష్మయ్య(60) శుక్రవారం రాత్రి వడదెబ్బతో మృతిచెందాడు.
మణుగూరు: మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీలోని కొండాయిగూడెం గ్రామానికి చెందిన తెరప లక్ష్మయ్య(60) శుక్రవారం రాత్రి వడదెబ్బతో మృతిచెందాడు. ఇతను శుక్రవారం మధ్యాహ్నం కూలి పనులకు వెళ్లాడు. అలసటగా ఉండడంతో సాయంత్రం వేళ రామానుజవరం సమీపంలోని చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత కూర్చున్న చోటనే మృతిచెందాడు. రాత్రవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకుతుండగా చెట్టు కింద, నిర్జీవ స్థితిలో లక్ష్మయ్య కనిపించాడు. ఇతనికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు.
పైనంపల్లిలో వృద్ధుడు..
నేలకొండపల్లి: మండలంలోని పైనంపల్లి గ్రామానికి చెందిన రేఖ అప్పయ్య(62) వడదెబ్బతో శనివారం మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
సోములగూడెంలో మహిళ..
పాల్వంచ రూరల్: పాల్వంచ మండలం సోములగూడెం గ్రామపంచాయతీలోని వీరునాయక్ తండాకు చెందిన మేకల కాపరి మాళోతు సుశీల(34) వడదెబ్బతో శుక్రవా రం రాత్రి మృతిచెందింది. ఆమె భర్త పదేళ్ల కిందటే మృతిచెందాడు. ఆమెకు ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉంది. తల్లిదండ్రుల మృతితో ఆమె అనాథగా మిగిలింది.
హస్నాబాద్‌లో వృద్ధుడు..
తిరుమలాయపాలెం: మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కూలీ పల్లి జగ్గులు(58) వడదెబ్బతో శనివారం మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.