హుజూర్‌నగర్(నల్లగొండ): మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండల కేంద్రంలో ఇందిరా సెంటర్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. హుజూర్‌నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన వట్టె శ్రీనివాస్, లక్ష్మీ దంపతులు బంధువుల ఇంటి నుంచి తమ టీవీఎస్ మోపేడ్ వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే హుజూర్‌నగర్ మండల కేంద్రంలో మలుపు వద్ద ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో భార్యభర్తలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీకి వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.