మహిళ అదృశ్యం | Woman missing | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Published Sun, Dec 20 2015 8:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

Woman missing

శంషాబాద్ : పనికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రుద్రాకాలనీలో నివాసముండే కె.పి. అనిత (28) ఈ నెల 18 ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది.

అయితే రాత్రైనా ఆమె తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అన్నిచోట్లా వెతకడం ప్రారంభించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం కుటంబసభ్యులు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement