
కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి
కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
కరీంనగర్: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ ఉపాధి హామీ కింద కూలీలకు 200ల రోజులు పనిదినాలను కల్పించాలనీ, రోజు కూలీ రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.