యుద్ధప్రాతిపదికన మరమ్మతులు | works done as early as possible | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

Published Tue, Sep 16 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్టు పంప్‌హౌస్‌లో నీటముని గిన మోటార్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.

కొల్లాపూర్: ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్టు పంప్‌హౌస్‌లో నీటముని గిన మోటార్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం ఆయన ప్రాజెక్టులోని ఎల్లూరు, జొన్నలబొగుడ లిఫ్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్లూరు లిఫ్టు పంప్‌హౌస్‌లో మోటార్లను పరిశీలించారు.

పంప్‌హౌస్‌లోని 4వ పం ప్ జాయింట్, షట్టర్ వద్ద నీరు లీకవుతున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. అనంతరం ఆయన ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పంప్‌హౌస్‌లో 4వ పంప్ జాయింట్, గేట్ షట్టర్ వద్ద లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
 
పూర్తిస్థాయిలో డీవాటరింగ్ చేసేందుకు అవసరమైన మోటార్లు లేవన్నారు. నిబంధనల ప్రకారం నీటిని తోడేందుకు 1050 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్ 750హెచ్‌పీ మోనార్క్ మో టార్లను మాత్రమే వాడుతున్నారన్నారు. ఈ కారణంగా పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. తాము  నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద కారణాలను అన్వేషించేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి నివేదికను పరిశీలించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కమిటీ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
 
ఎల్లూరు లిఫ్టు కింద ప్రస్తు తం సాగులో ఉన్న 25వేల ఎకరాల ఆయకట్టును కాపాడటం తమ ప్రధాన కర్తవ్యమని, ఇందుకుగాను లిఫ్టులోని ఒక పంప్‌ను రన్ చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. మరమ్మతు పనులను   సీఈ ప్రత్యక్షంగా పర్యవేక్షించి రోజువారీ పురోగతిపై ప్రభుత్వానికి సమాచారం అందిస్తారన్నారు. లోయర్ జూరాల ప్రాజెక్టులో వరద నీరు చేరడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయి తీవ్ర నష్టం జరిగిందని, అక్కడ కూడా  సాంకేతిక , నాణ్యతాలోపలే ప్రమాదానికి కారణమన్నారు. లోయర్ జూరాల ఘట నను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ. జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌రాష్ట్ర నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, గట్టు భీముడు తదితరులు పాల్గొన్నారు.
 
రూ.670 కోట్లతో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు
నాగర్‌కర్నూల్: పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు ప్రస్తు త బడ్జెట్‌లో రూ.670 కోట్లు మంజూరు చేసి వచ్చే ఖరీఫ్ నాటికి మూడు లక్షల ఎక రాలకు సాగునీరందించేందుకు చర్యలు  తీసుకుంటామని మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత పాలకు లు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటంలో ఉద్ధేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్‌లో బారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
 
పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేకు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించేందుకే మూడేళ్లు పట్టిందన్నారు. కేసీఆర్ దీనిపై సమీక్ష నిర్వహించి సర్వే కోసంరూ. 5కోట్లు మంజూరు చేశారన్నారు.  ఎంజీఎల్‌ఐ మొదటి లిఫ్ట్ మోటార్లు మునిగిపోవటానికి బాధ్యులెవరన్న విషయంపైఅవగాహనకు వచ్చా మని, అయితే దీనిపై నిపుణుల కమిటీ వేశామన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘట నలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు అంశం లేనందున లేని అంశాన్ని తలపైకి ఎత్తుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్ష విరమించాలని హరీష్‌రావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement