వ్యాక్సిన్‌ దిశగా.. ముందుకు | World Health Organization Focusing On Coronavirus Vaccine | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ దిశగా.. ముందుకు

Published Sat, May 23 2020 5:02 AM | Last Updated on Sat, May 23 2020 5:02 AM

World Health Organization Focusing On Coronavirus Vaccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ పలు దశలు దాటుతున్నాయి. 50 లక్షల మందికి పైగా సోకి 3.3 లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్‌ను అదుపుచేసేందుకు ప్ర పంచంలోని పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు 100కు పైగా వ్యాక్సిన్‌ శాంపిళ్లపై పరిశోధనలు చేస్తున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీకి 12 నుంచి 18 నె లల సమయం పడుతుందనే అంచనాలున్నాÆ ుు. అ యితే అంతకంటే ముందే మార్కెట్‌లోకి తెచ్చేందు కు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీలో 9 సంస్థలు ముందంజలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా అంటోంది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ చేస్తున్న కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయనే వార్తలొస్తున్నా.. కొంద రు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీల ప్రతినిధులు మా త్రం వచ్చే అక్టోబర్‌ లేదా నవంబర్‌ నాటికి దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందన్నారు.

ఎంఆర్‌ఎన్‌ఏ సాయంతో.. 
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడర్నా ఐఎన్‌ సీ ఈ ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం విజయ వంతమైంది. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ తయారీకి పూనుకున్న ఈ సంస్థ మొదటి ప్రయత్నంలో భాగంగా 8 మందిపై ప్రయోగం జరపగా, మంచి ఫలితాలొచ్చాయని, ఈ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ పై పోరాడే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయని తేలిం ది. ఎంఆర్‌ఎన్‌ఏ–1273 వ్యాక్సిన్‌ పేరుతో మార్చి లో జరిపిన ఈ పరిశోధనల గురించి ఇటీవలే ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలైలో మరో ప్రయత్నం చేస్తామని ఆ సంస్థ అంటోంది.

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కూడా కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌లో ఉన్న జన్యుపదార్థంతో అడినోవైరస్‌ అనే సాధారణ జలుబును కలిగించే వైరస్‌ను కలిపి ప్రయోగం చే సింది. చైనాలోని బీజింగ్‌కు చెందిన సినోవ్యాక్‌ బ యోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా పీకోవ్యాక్‌ అనే వ్యాక్సిన్‌ తయారుచేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ తయారీ కూడా తొలిదశ పూర్తి చేసుకుని తదుపరి దశకు చే రిందని ఆ కంపెనీ చెబుతోంది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ కోతుల్లో యాంటీబాడీస్‌ను వృద్ధి చేయలేకపోయినా సినోవ్యాక్‌ సంస్థ తెస్తున్న పీకోవ్యాక్‌ మాత్రం మంచి ఫలితాలనిచ్చిందని తెలుస్తోంది.

వచ్చేస్తోందా..? 
కరోనా వ్యాధికి విరుగుడు మరో ఐదారు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండి యా గ్రూప్‌ డైరెక్టర్‌ పురుషోత్తం నంబియార్‌ పేర్కొ న్నారు. ఈ వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ మానవులపై ప్రయోగించే దశకు చేరుకుందని, వివిధ దేశాల్లో జ రుగుతున్న ఈ ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయని, ప్రపంచానికి ఈ వ్యాక్సిన్‌ను తామే పరిచయం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద కంపెనీ. దీనికి ఎగుమతులు, దిగుమతుల విభాగం డైరెక్టర్‌గా ఉన్న నంబియార్‌ కరోనా వ్యాక్సిన్‌ తయారీపై ఓ మలయాళీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ‘కరోనా వ్యాక్సిన్‌ త యారీకి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది. అవి సఫలమైతే ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్‌ తయారీకి ట్రయల్స్‌ ఊపందుకున్నాయి. మా నవులపై ప్రయోగం చేసే స్థాయికి వచ్చాయి. అంతా సవ్యంగా జరిగితే ఐదారు నెలల్లో వ్యాక్సిన్‌ భారత మార్కెట్లోకి వచ్చేస్తుంది.

తక్కువ ధరకే దేశీయ మార్కెట్‌లోకి తెస్తాం. వ్యాక్సిన్‌ యూనిట్‌ రూ.వె య్యి వరకు ఉండొచ్చు. జూలై, ఆగస్టులో ధరను నిర్ణయిస్తాం. కరోనా వైరస్‌ అంతరించేది కాదు. దాం తో కలసి మనం జీవించాల్సిందే. భవిష్యత్తులో ఈ వైరస్‌ బారిన పడే వారికి మేం తయారు చేసే వ్యా క్సిన్‌ ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు చేస్తున్నా యి. అయితే మేమే ఈ వ్యాక్సిన్‌ను అందరికంటే ముందే తయారు చేయబోతున్నాం. ఆక్స్‌ఫర్డ్‌ వర్సి టీకి చెందిన జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. మేం ఆస్ట్రా జెనెకా కంపెనీతో కలసి పనిచేస్తున్నాం. ఆక్స్‌ఫర్డ్‌ నుంచి వ్యాక్సిన్‌ త యారీ సాంకేతికతతో పాటు సెల్‌ బ్యాంకు తీసుకుంటున్నాం. ఈ సెల్‌ బ్యాంకును పుణేలోని మా ఫ్యాక్టరీలో ఫార్ములేట్‌ చేసి బల్క్‌ వ్యాక్సిన్లు తయారు చేసే పనిలో ఉన్నాం’ అని నంబియార్‌ వెల్లడించారు.

భారత్‌లోనే ముందుగా తయారీ..! 
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కరోనాకు కళ్లెం వేసే మందు మన దేశంలోనే ముందుగా ఉత్పత్తి కానుంది. ఇటీవల డబ్ల్యూహెచ్‌వో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు కూడా భారత్‌కు ఆ సామ ర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ తయారీకి స్ట్రైడ్స్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌లతో పాటు పలు సంస్థలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు తమ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చాయి. ఆ యుర్వేద రంగంలో అశ్వగంధ మూ లికలతో మందును తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ ఈ దిశలో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఫైజర్‌ అనే కంపె నీ కూడా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అనే సంస్థతో కలసి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ తయారీ పనిలో పడింది.

బీఎన్‌టీ–162 పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 360 మందిపై ప్రయోగించి విజయవంతమయ్యారని, జూలైలో ఏకంగా అమెరికా వ్యాప్తంగా 8 వేల మందిపై ప్రయోగించనున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికాకే చెందిన నోవా వ్యాక్స్‌ అనే సంస్థ ఎన్‌వీఎక్స్‌–కరోనా2373 పేరుతో తయా రుచేస్తున్న వ్యాక్సిన్‌ను ఆస్ట్రేలియాకు చెందిన 130 మంది వలంటీర్లపై ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో కంపెనీ కూడా పొగాకులో ఉండే ప్రోటీన్ల సాయంతో వ్యాక్సిన్‌ తయారు చేసే పనిలో పడ్డట్లు వెల్లడించింది. గినియా పందులపై ప్రయోగించి విజయవంతంగా యాంటీబాడీస్‌ను వృద్ధి చేసిన ఇనోవియో అనే కంపెనీ కూడా తన ప్రయోగశాలల్లో ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 40 మంది వలంటీర్లకు 2 డోసుల చొప్పున ఇచ్చామని, జూన్‌ నెలాఖరుకు మరింత పురోగతి వస్తుందని చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement