
వైఎస్‌ఆర్ సీపీ విజయం
సర్పంచ్‌గా గెలిచిన నరాల సంజీవరెడ్డి
ఎర్రుపాలెం : చొప్పకట్ల పాలెం గ్రామ పంచాయతీ శనివారం ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన నరాల సంజీవరెడ్డి విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బొగ్గుల శ్రీనివాసరెడ్డిపై 10 ఓట్ల మెజార్టీ పొందారు. గ్రామంలో మొత్తం 1,184 మంది ఓటర్లు ఉండగా 1,100 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నరాల సంజీవరెడ్డికి 421 ఓట్లు రాగా,్ద బొగ్గుల శ్రీనివాసరెడ్డికి 411 ఓట్లు వచ్చాయి.
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బొగ్గుల కృష్ణారెడ్డికి 268 ఓట్లు వచ్చాయి. జడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు సమక్షంలో ఎంపీడీఓ పి విజయ, ఎన్నికల అధికారి వి ప్రసాదరావు సమక్షంలో నరాల సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠ భరితంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల పోరులో నరాల సంజీవరెడ్డి గెలుపుతో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు. వైఎస్ జగన్, పొంగులేటి శ్రీనన్న జిందాబాద్, వైఎస్సార్సీపీ వర్దిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శీన్నన్నకు అంకితం
సంజీవరెడ్డి విజయూన్ని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అంకితం చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి ప్రకటించారు. ఆయన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులతో ఆయనను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారని చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లాకార్యదర్శి లక్కిరెడ్డి నర్సిరెడ్డి, మండల మహిళా కన్వీనర్ వేమిరెడ్డి త్రివేణి, డివిజన్ నాయకలు వెమిరెడ్డి లక్ష్మారెడ్డి, మామునూరు సర్పంచ్ గూడూరు రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.