వైఎస్సార్ సీపీ తెలంగాణ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణానదిపై సోమ శిల– సిద్ధేశ్వరం వంతెనను త్వరగా పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలం గాణ డిమాండ్ చేసింది. రాయలసీమ నుంచి కృష్ణానది మీదుగా పుట్టీలో వస్తూ పాత పాల మూరు జిల్లా మంచాలకట్ట వద్ద 61 మంది జలసమాధి అయి పదేళ్లు కావొస్తోందని ఆ పార్టీ పేర్కొంది. ఈ ఘటనకు ఆనాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలించిపోయి కృష్ణా నదిపై రాకపోకలకోసం సోమశిల–సిద్ధేశ్వరం వంతెనకు నిధులు మంజూరు చేసిన విష యాన్ని గుర్తుచేసింది. వైఎస్సార్ మరణం తర్వాత పలువురు సీఎంలు మారారని, కానీ ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి గున్‌రెడ్డి రాంభూపాల్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం బ్రిడ్జి నిర్మా ణానికి అనుమతినిచ్చి రూ.193 కోట్లు కేటా యించిందన్నారు.అయితే సర్వే పనులను కోల్‌కతాకు చెందిన సీటెక్ కంపెనీ చేపట్టి నివేదికను ఆర్‌అండ్‌బీ అధికారులకు అందిం చినా ఈ బ్రిడ్జి నిర్మాణంలో పురోగతి లేద న్నారు. ఈ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే కొల్లా పూర్ నియోజకవర్గంతో పాటు, నాగర్ కర్నూ ల్ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ వంతెన కోసం నాగర్‌కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడిని తేవాలని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
జాతీయ రహదారుల్లోనూ అన్యాయం...
రాయచూర్ నుంచి గద్వాల్, అలంపూర్, పెబ్బేరు, కొల్లాపూర్, అచ్చంపేట, దేవర కొండ, మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు జాతీయ రహదారిని అనుసంధానించాలని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. దీనివల్ల పాత పాలమూరు, నల్లగొండ జిల్లాలు అభివృద్ధి అవుతాయన్నారు. కొత్తగా మంజూరైన 19 జాతీయ రహదారుల్లో నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రాధాన్యం లభించలేదన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. 19 జాతీయ రహదారులతో పాటు పాత పాలమూరు జిల్లాలోని పట్టణాల అనుసంథాన ప్రక్రియను పూర్తిస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.