
ప్రముఖ నటి తాప్సీ శుక్రవారం దుర్గగుడిపై సందడి చేశారు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విజయవాడ వచ్చిన ఆమె ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ కోన వెంకట్ శుక్రవారం దర్శించుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన తాప్సీ, కోన వెంకట్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ప్రత్యేక పూజలు జరిపించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం తాప్సీ మీడియాతో మాట్లాడారు. గతంలో పలుమార్లు అమ్మవారి గురించి తెలుసుకున్నానని, ఈసారి దర్శనం చేసుకోవడం తన అదృష్టమన్నారు. తాప్సీతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment