
పరీక్షల్లో ఎయిమ్స్ మందులు ఫెయిల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. రాజన్స్ బన్సాల్ అనే ఆర్టీఐ ఉద్యమకారుడు ఈ అంశంపై దరఖాస్తు చేశాడు. 2010 నుంచి 2015 మధ్యకాలంలో ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం పన్నెండు రకాల మెడిసిన్లు పరీక్షల కోసం తీసుకున్నామని, వాటిల్లో ఏఒక్కటీ పాస్ కాలేదని అతడికి ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ శాఖ తెలిపింది. ఇలా విఫలమైన మందుల్లో ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రి మందులు కూడా ఉండటం విశేషం. ఆ శాఖ తీసుకున్న డ్రగ్స్ నమునాలు సేకరించిన ఆస్పత్రులివే..
* సంజీవ్ గాంధీ ఆస్ప్రత్రి
* సెంట్రల్ మెడికల్ స్టోర్ ఎంసీడీ బిల్డింగ్(సివిల్ లైన్స్)
* సఫ్దార్ జంగ్ ఆస్ప్రత్రి
* ఎయిమ్స్
* శ్రీ దాదా దేవ్ మత్రి అవమ్ శిషు చికిత్సాలయ(దాబ్రి)
* లోక్ నాయక్ ఆస్పత్రి
* జీటీబీ ఆస్పత్రి
* దీన్ దయాల్ ఉపధ్యాయ్ ఆస్పత్రి
* ఆచార్య భిక్షు ఆస్పత్రి
* రావ్ తులా రాం మెమోరియల్ ఆస్పత్రి