చెన్నూర్, న్యూస్‌లైన్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కొర్చి తాలూకా బస్వాడా అటవీ ప్రాంతంలో మంగళవారం వేకువజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్వాడాఅటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతదేహాలను గడ్చిరోలి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మృతి చెందిన మావోయిస్టులు మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 5వ ప్లాటూన్‌కు చెందిన దళకమాండర్ నవీన్‌తోఫా, దళసభ్యులు వీరు నైతం, సునీల్ తడామి, రాజేశ్ తోఫా, సల్సు, శ్యాంకో, పున్ని నరోట్‌లు ఉన్నారన్నారు.
తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశం!
మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగడంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీ సులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో తప్పిం చుకున్న మావోయిస్టులు ప్రాణహిత నది మీదుగా తెలంగాణ జిల్లాల్లో ప్రవేశిస్తారనే అనుమానంతో ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఇరుప్రాంతాల పోలీసులు ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్
Published Wed, Feb 19 2014 3:58 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement