పోఖ్రాన్లో కూలిన జాగ్వార్ విమానం | A Jaguar aircraft of the Indian Air Force crashed over Pokhran | Sakshi
Sakshi News home page

పోఖ్రాన్లో కూలిన జాగ్వార్ విమానం

Published Mon, Oct 3 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

పోఖ్రాన్లో కూలిన జాగ్వార్ విమానం

పోఖ్రాన్లో కూలిన జాగ్వార్ విమానం

జైపూర్: రాజస్థాన్లో జైసల్మెర్ సమీపంలోని పోఖ్రాన్లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిందా లేక మరేదైనా కారణమా అన్న విషయం తెలియరాలేదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. భారత వైమానిక దళంలో జగ్వార్ శక్తివంతమైన యుద్ధ విమానాలు. అణ్వాయుధాలతో దాడి చేయగల సామర్థ్యం వీటికి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement