రాహుల్పై 'ఆప్' అభ్యర్థిగా కుమార్ విశ్వాస్ | Aam Aadmi Party announces first list of 20 candidates for Lok Sabha polls | Sakshi
Sakshi News home page

రాహుల్పై 'ఆప్' అభ్యర్థిగా కుమార్ విశ్వాస్

Published Sun, Feb 16 2014 4:02 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

రాహుల్పై 'ఆప్' అభ్యర్థిగా కుమార్ విశ్వాస్ - Sakshi

రాహుల్పై 'ఆప్' అభ్యర్థిగా కుమార్ విశ్వాస్

న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దృష్టి సారించింది. ఇందులో భాగంగా 20 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జాతీయ పార్టీల అగ్రనేతలు, కేంద్రమంత్రులపై అభ్యర్థులను పోటీకి నిలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధీ నుంచి కుమార్ విశ్వాస్ను పోటీ చేస్తారని ఆప్ నేత మనీష్ షిసోడియా వెల్లడించారు.

కేంద్ర మంత్రులు కపిల్ సిబల్పై అశతోష్(చాందీ చౌక్), సల్మాన్ ఖుర్షీద్పై ముకుల్ త్రిపాఠి(ఫరూకాబాద్), మనీష్ తివారిపై హెచ్ఎస్ ఫూల్కా(లూధియానా), మిలింద్‌ దేవ్‌రాపై మీరా సన్యాల్‌(దక్షిణ ముంబై), బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీపై అంజలి దామానియా (నాగపూర్), ములాయంసింగ్‌ యాదవ్‌పై బాబా హరదేవ్‌, సురేష్ కల్మాడీపై సుభాష్ వడే పోటీ చేయనున్నారు.

యోగేంద్ర యాదవ్(గుర్గావ్), మీరా సన్యాల్(దక్షిణ ముంబై), మేధా పాట్కార్(ఈశాన్య ముంబై), మయాంక్ గాంధీ(వాయవ్య ముంబై) పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement