న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో రోజురోజుకూ కరెంట్ సమస్య ఉత్పన్నమవుతుండటంతో దాన్ని అధిగమించే దిశగా ఢిల్లీ ఆమ్ఆద్మీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులోభాగంగానే సౌర విద్యుత్ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ప్రత్యేకించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సు షెల్టర్లపైభాగంలో సోలార్ ప్యానెల్ను నిర్మించి సౌరవిద్యుత్ను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
ప్రతి సంవత్సరం సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరిగిపోతుండటంతో భవిష్యత్త్లో విద్యుత్ ఉత్పత్తి సమస్యను నివారించాలంటే ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి ఒక్కటే మార్గమని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. సోలార్ ప్యానెల్స్ను సిటీ బస్సు షెల్టర్ల పైకప్పు భాగంలో అమర్చడం వల్ల ఎక్కువమొత్తంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చనని మంత్రి సత్యేందర్ జైన్ పిటీఐతో చెప్పారు.
ఈ సోలార్ ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. బస్సు షెల్టర్ల పైభాగంలో సోలార్ ప్యానెల్స్ నిర్మించడం వల్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వానికి సులభంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సోలార్ ప్యానెల్ కలిగిన షెడ్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు జైన్ తెలిపారు.
వీటి నిర్మాణం ఆధునిక సాంకేతికతో తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి జైన్ పేర్కొన్నారు. కాగా, సోలార్ విద్యుత్ ధరలు సాంప్రదాయ విద్యుత్ ఒకేలా ఉంటాయనీ, కానీ రానున్న సంవత్సరాల్లో సోలార్ విద్యుత్ ధరలు చాలా తక్కువ ఉంటాయని సత్యేందర్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక బస్సు షెల్టర్లపై సౌర విద్యుత్..
Published Sun, Aug 30 2015 11:22 AM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM
Advertisement