
దివంగత నాయకురాలు జయలలితతో రామచంద్రన్(ఫైల్)
చెన్నై: తనపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతుదారులపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ గురి పెట్టారు. పన్నీరు సెల్వంకు దన్నుగా నిలబడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి పదవి నుంచి జి. రామచంద్రన్ ను తొలంగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను తప్పించారు. రామచంద్రన్ స్థానంలో ఐటీ విభాగం కార్యదర్శిగా వీవీఆర్ రాజ్ సత్యయాన్ ను నియమించారు.
తనపై తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి శశికళ తొలగించిన సంగతి తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని చిన్నమ్మ ఈ చర్యల ద్వారా తెలియజెప్పారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని, ఏ పార్టీలోనూ చేరనని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి తొలగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.