పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా దీనానగర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిసింది. దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొరబడి.. పోలీసులతో పాటు పలువురు సామాన్య పౌరులను కూడా కాల్చి చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయి. దీంతో ఎన్కౌంటర్ ముగిసినట్లయింది. పంజాబ్ పోలీసు కమాండోలు, ఎన్ఎస్జీ బలగాలతో పాటు కేంద్రం పంపిన ప్రత్యేక బలగాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి.
- దాదాపు 11 గంటలకు పైగా సాగిన కాల్పులు
- ఉగ్రవాదుల దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డుల మృతి
- మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపిన భద్రతా దళాలు
- తీవ్రవాదుల దాడిలో మరో ముగ్గురు పౌరుల మృతి
- తీవ్రవాదుల ఆపరేషన్లో ముమ్మరంగా పాల్గొన్న పంజాబ్ పోలీసు కమాండోలు
- దాడికి పాల్పడ్డవారు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులని అనుమానం