
లోకల్ ఫైండ్స్‌ను ప్రారంభించిన అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీ వద్ద ఉన్న పాత లేదా కొత్త ఉత్పత్తులను విక్రయించాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ లోకల్ ఫైండ్స్ మీకో వేదికను కల్పిస్తోంది. ఈ వేదికగా వద్ద ఉన్న పుస్తకాలు, వీడియో గేమ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్, హోమ్ డెకర్ వంటి అన్ని విభాగాల్లో ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఉత్పత్తుల డెలివరీ, పేమెంట్స్ సేవలను మాత్రం అమెజాన్ అందిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయోగాత్మకంగా బెంగళూరులో ప్రారంభమైన ఈ సేవలను ఇప్పటికే 600 మంది విక్రయదారులు, 30 వేల మంది వినియోగదారులు వినియోగించుకున్నారని కంపెనీ తెలిపింది. ఇప్పుడీ సేవలను ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరించింది.