అమూల్ పాలు రీటెయిల్ లో అందించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు.
ప్యాకెట్ పాలు కావాలంటే సమీపంలో ఉన్న మిల్క్ బూత్‌కు వెళ్లాల్సిందే. అదీ ఉదయాన్నే లేచి వెళ్లక తప్పదు. ఆలస్యమైతే ఎక్కువ రేటుకి కిరాణా దుకాణాల్లో కొనాల్సిందే. అదే ఒక క్లిక్ దూరంలో తాజా (ప్యాకెట్) పాలు దొరికితే గంతేయరూ.. పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న దిగ్గజ బ్రాండ్ అమూల్ దేశంలో తొలిసారిగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతానికి అహ్మదాబాద్‌లో పైలట్ కింద ఈ సేవలను పరీక్షిస్తోంది. అతి త్వరలో వాణిజ్య పరంగా యాప్‌ను అందుబాటులోకి తేనుంది. అమూల్ తాజా పాలను విక్రయిస్తున్న నగరాల్లో దశలవారీగా యాప్ సర్వీసులను పరిచయం చేయనుంది.