
ఆధ్యాత్మిక విశేషాల యాప్
సాక్షి, సిటీబ్యూరో: ప్రసిద్ధ అగరబత్తీల బ్రాండ్ మంగళ్‌దీప్ కొత్త యాప్‌ను విడుదల చేసింది. మంగళ్‌దీప్ పూజాస్, భజన్స్, మంత్రాస్ అండ్ మోర్ పేరుతో రూపొందిన ఈ యాప్‌లో పూజా సంబంధమైన విశేషాలతో పాటు భక్తి పాటలు, పంచాంగ క్యాలెండర్, ఆలయాల సమాచారం, మంత్రోచ్ఛారణ... వంటి ఆధ్యాత్మిక అంశాలు ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తుందన్నారు. ప్రస్తుతానికి ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చిందని వివరించారు.