శుక్రవారం హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణను నిలదీస్తున్న స్థానిక మహిళలు
హిందూపురం: ఉపాధి పనులు లేక పిల్లలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నామని తమకు ఉపాధి చూపించాలని అనంతపురం మహిళలు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్టను నిలదీశారు.
శుక్రవారం పట్టణంలో రహదారి నిర్మాణ భూమిపూజలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మహిళలు తాము కరువు కాటకాలతో తల్లడిల్లిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ఉపాధి పనులు కల్పించాలని చుట్టుముట్టారు. ఒక్కసారిగా మహిళలందరూ చుట్టుముట్టడంతో ఏమి చెప్పాలో కాసేపు ఆయనకు అర్థం కాలేదు.
తేరుకున్న అనంతరం తనదైన శైలిలో రెండు నెలల తర్వాత మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. రెండు నెలల తర్వాత అంటే అప్పటికి ఉపాధి పనులు ఆగిపోతాయి కదా మరి ఉపాధి ఎలా కల్పిస్తారని మహిళలు వాపోయారు.