బీజేపీని వ్యతిరేకిస్తే జాతి వ్యతిరేకినవుతానా?
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ముస్లింల హత్యలను ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.
స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లైనా.. దేశంలో ఇంకా ముస్లింలు అద్దెకు ఇళ్లు పొందడంలో ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకించిన ప్రతీసారి తనను ఎందుకు జాతి వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారన్నారు. మతతత్వ ఘటనలను విచారించేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీ చట్టా న్ని మార్చాలని, సమాన అవకాశాల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.