సారీ.. నన్ను క్షమించండి: ఆసిస్‌ కెప్టెన్‌ | Australian captain Smith says sorry | Sakshi
Sakshi News home page

సారీ.. నన్ను క్షమించండి: ఆసిస్‌ కెప్టెన్‌

Published Wed, Mar 8 2017 12:55 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

సారీ.. నన్ను క్షమించండి: ఆసిస్‌ కెప్టెన్‌

సారీ.. నన్ను క్షమించండి: ఆసిస్‌ కెప్టెన్‌

బెంగళూరు టెస్టులో డీఆర్‌ఎస్‌ రివ్యూ కోసం తాను డ్రెసింగ్‌ రూమ్‌కు సైగలు చేసిన వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌  ఎట్టకేలకు స్పందించాడు. ఈ విషయంలో తన తీరును భారత సీనియర్‌ క్రికెటర్లతోపాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా తప్పుబట్టిన నేపథ్యంలో అతను క్షమాపణ చెప్పాడు.

మ్యాచ్‌లో జరిగిన ఘటన గురించి స్టీవ్‌ స్మిత్‌ విలేకరులకు వివరణ ఇచ్చాడు. 'బంతి నేరుగా వచ్చి నా ప్యాడ్‌కు తాకింది. దీంతో నాన్‌-స్ట్రైకర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం చూశాను. ఆ తర్వాత ప్యాడీ వైపు తిరిగాను. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఇది తొలిసారి జరిగింది. నా జట్టు ఆటగాళ్ల వైపు చూశాను. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. అప్పుడు బుర్ర కొద్దిగా పనిచేయలేదు' అని పేర్కొన్నాడు. తాను చేసింది తప్పేనని అంగీకరించాడు.

బెంగళూరు టెస్టులో ఉమేశ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ను అంపైర్‌ నైజెల్‌ లాంగ్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా.. రివ్యూకు వెళ్లాలని భావించిన స్మిత్‌ ముందుగా సహచరుడు హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించాడు. అయినా సందేహం తీరక ఏంటి అన్నట్లుగా చేతులతో డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు సైగ చేశాడు. దీనిని గుర్తించిన కోహ్లి వెంటనే దూసుకొచ్చి అలా ఎలా చేస్తావా అంటూ స్మిత్‌తో వాదించాడు. ఇది తప్పంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్మిత్‌ను కూడా హెచ్చరించిన అంపైర్, కోహ్లిని కూడా పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఈ వివాదంపై భారత సీనియర్‌ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ స్పందిస్తూ.. స్మిత్‌ తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించాడు. 'కామెంటరీ బాక్స్‌లో ఉన్న చాలామంది ఈ వివాదం గురించి స్పందించారు. డీఆర్‌ఎస్‌ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్‌ రూమ్‌ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్‌ నిపుణుడి సూచనలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దారుణం. హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించిన తర్వాత కూడా స్మిత్‌ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్‌ రూమ్‌ వైపు  చూశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీనిపై ఐసీసీ, మ్యాచ్‌ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి' అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఆకాశ్‌ చోప్రా సైతం స్మిత్‌ తీరును తప్పుబట్టారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement