
ఎయిర్‌టెల్ అపరిమిత వాయిస్ కాలింగ్ పథకాలు
న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్ వ్యాపారాన్ని మరింత వృద్ధిబాటలో నడిపించడానికి ప్రముఖ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం రెండు అపరిమిత వాయిస్ కాలింగ్ పథకాలను ప్రవేశపెట్టనుంది. నెలకు రూ.49లకే అపరిమిత లోకల్ కాల్స్‌ను, నెలకు రూ.99లకే అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌ను అందించే పథకాలను త్వరలో కస్టమర్ల కోసం తీసుకురానుంది. గతేడాది డిసెంబర్ చివరకు ఎయిర్‌టెల్ దాదాపు 14.89 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లను కలిగి ఉంది.