బిగ్‌బజార్‌కు బిగ్‌బాస్‌ ఆయనే! | Big Bazar ka Bigg Boss hamare desh ka Pradhan mantri | Sakshi
Sakshi News home page

బిగ్‌బజార్‌కు బిగ్‌బాస్‌ ఆయనే!

Published Wed, Nov 30 2016 3:36 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

బిగ్‌బజార్‌కు బిగ్‌బాస్‌ ఆయనే! - Sakshi

బిగ్‌బజార్‌కు బిగ్‌బాస్‌ ఆయనే!

  • ‘పేటీఎం’కాదు ‘పేపీఎం’గా మారారు
  • మళ్లీ నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ

  • పట్నా: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిగ్‌బజార్‌ బిగ్‌బాస్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. పిల్లలు సైతం ‘పేటీఎం’ అనకుండా ‘పేపీఎం’ అంటున్నారని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ బిహార్‌ రాజధాని పట్నాలో మమత బుధవారం ర్యాలీ నిర్వహించారు.

    ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ‘కష్టకాలంలో మహిళలు తాము పొదుపుచేసుకున్న డబ్బును ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటారు. కానీ మోదీ మొత్తం అంతా తీసుకున్నారు. స్త్రీధనానికి, స్త్రీశక్తికి ఇది అవమానం’ అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉందని, ఇది ఆర్థిక ఎమర్జెన్సీ లాంటిదని ఆమె అన్నారు. బిచ్చమైనా అడుకుంటాం, రోడ్డుపైనా పడుకుంటాం కానీ, మీ డబ్బును ఆశించమని ప్రధాని మోదీని ఉద్దేశించి మమత పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement