కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తృణమాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల వల్ల దేశంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలని మోదీని ప్రశ్నించారు.
‘మోదీ బాబూ.. మీ నిర్ణయం వల్ల ఇంకెంతమంది చనిపోవాలి?’ అని మమత ట్వీట్ చేయగా, తృణమాల్ కాంగ్రెస్ ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ దీన్ని రీట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిల్చుని అస్వస్థతకు గురై దాదాపు 95 మంది మరణించారని పేర్కొన్నారు. గత నెల 8వ తేదీన 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను విడుదల చేశారు. కాగా డిమాండ్‌కు తగినట్టుగా ప్రజలకు కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మోదీజీ... ఇంకెంతమంది మరణించాలి?
Published Mon, Dec 12 2016 1:54 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
Advertisement