న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శల బాణం ఎక్కుపెట్టారు. మోడీ నాటకాల రాయుడని దిగ్విజయ్ సింగ్ శనివారమిక్కడ ఎద్దేవా చేశారు. ఎవరు సహకరిస్తే వారిని ముంచే తత్వం మోడీదని ఆరోపించారు. తనకు సహకరించిన కేశూభాయ్ పటేల్, శంకర్ సింఘ్ వాఘేలా, అద్వానీలను మోడీ ముంచారని డిగ్గీరాజా గుర్తు చేశారు. మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై ఎన్‌డిఏలో కానీ, బిజెపిలో కానీ ఏకాభిప్రాయం లేదన్నారు.