లండన్: తమ దేశానికి వలస వచ్చే విద్యార్థులు, వ్యాపారవేత్తల వీసా నిబంధనలను బ్రిటన్ సడలించింది. దీనివల్ల ఇక వీరికి వీసా జారీ సులభతరం కానుంది. కొత్త విధానం భారతీయులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం బ్రిటన్ వచ్చే వారు కొద్దికాలం పాటు చదువుకునేందుకు, శిక్షణ పొందేందుకు అనుమతిస్తారు. వ్యాపార పర్యాటకులకు జారీ చేసే వీసా కింద బహుళ జాతి కంపెనీలు తమ ఆడిటర్లను బ్రిటన్ రప్పించుకునేందుకు వీలుంటుంది. వీరు కొద్దికాలం స్వల్పకాలిక కోర్సులు చేసేందుకు, చదువుకునేందుకు అనుమతిస్తారు. కొత్త విధానాన్ని శుక్రవారం ప్రకటించారు.