18 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనానికి అడ్డుకట్ట పడింది. మార్కెట్ సూచిలు సోమవారం స్వల్ప లాభాలు నమోదు చేసింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 18 పాయింట్లు లాభపడి 19182 వద్ద స్థిరపడింది. గత 8 సెషన్స్లో సెన్సెక్స్ 1139 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 5685 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావరణ నెలకొనడంతో మార్కెట్ స్వల్ప లాభాలకే పరిమితమయింది. బీఎస్ఈ సూచిలో 18 షేర్లు లాభాలు ఆర్జించగా, 12 షేర్లు నష్టాలు చవిచూశాయి. ఐటీసీ, కోల్ ఇండియా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ లీవర్ వాటాలు లాభాలు ఆర్జించాయి.