ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 26న రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మార్చి 27న ఆర్థిక సర్వే, ఆ మరుసటి రోజే అంటే మార్చి 28న ఆర్థిక మంత్రి సాధారణ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ కమిటీ అన్ పొలిటికల్ ఎఫైర్స్ బుధవారం న్యూఢిలీలో సమావేశమై బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 20 వరకు... రెండో విడత ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరగనున్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్షం కాంగ్రెస్ ఇతర పార్టీలు సన్నాహాకాలు ప్రారంభించాయి.