రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం.. | Bus on way to Rahul Gandhis rally overturns in Gujarat, 35 injured | Sakshi
Sakshi News home page

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..

Published Mon, May 1 2017 6:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..

అహ్మదాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. తాపి జిల్లా కంజా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు.

నర్మదా జిల్లాలోని దేదియపడ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం కంజా వద్ద వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కాగా ఎక్కడి నుంచి వీరిని బహిరంగ సభకు తీసుకువెళ్తున్నారన్న విషయం తెలియరాలేదు. క్షతగాత్రులను సూరత్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని బర్దోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement