న్యూఢిల్లీ : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లకు గాలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు.
తెలంగాణపై కేంద్రం నియమించిన మంత్రుల బృందంలోని సభ్యులు, మరికొందరు కీలక నేతలు కూడా ఈ భేటీకి హాజరు అయ్యారు. కాగా తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాతే పోలవరం ముంపు గ్రామాల విలీనం, అవినీతి నిరోధక బిల్లులపై ఆర్డినెన్స్లు తీసుకు రావాలన్న నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ వాయిదా వేసింది.
* ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు
* కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 10శాతం డీఏ పెంపు
* 50లక్షల మంది ఉద్యోగులు, 30లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి
* పీఎఫ్ పరిధిలోని ఉద్యోగులకు కనీస పింఛన్ రూ.1000కి పెంపు
* ఎన్నికల వ్యయపరిమితిని పెంచుతూ నిర్ణయం