రాహుల్ బిల్లులపై ఆర్డినెన్స్ వాయిదా
సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఉద్దేశించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు కూడా పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం నియమించిన మంత్రుల బృందంలోని సభ్యులు, మరికొందరు కీలక నేతలు కూడా దీనికి హాజరైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వచ్చిన తర్వాత మాత్రమే పోలవరం ముంపు గ్రామాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే అంశాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అవినీతి నిరోధక బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకురావాలన్న నిర్ణయాన్ని మాత్రం కేబినెట్ వాయిదా వేసింది. ఈ బిల్లు కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుబట్టిన విషయం తెలిసిందే. అందుకే దీన్ని రాహుల్ బిల్లు అని కూడా కొందరు నేతలు వ్యవహరించారు.